నిర్మలా సీతారామన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి: మంత్రి లోకేష్

Administrator 28-11-2025
127
అమరావతి, నవంబర్ 28: రాజధానిలో బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) పాల్గొని ప్రసంగించారు. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని విమర్శించారు. మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వ్యక్తి కోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని విమర్వించారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని గుర్తుచేశారు. అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని.. పవర్ ఫుల్ ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది అని చెప్పుకొచ్చారు.

ఈ కథను షేర్ చేయండి

వ్యాఖ్యలు (3)

U
R
Ramesh Kumar 2 hours ago

చాలా బాగుంది ఈ వార్త. మరిన్ని వివరాలు కావాలి.

S
Sita Devi 5 hours ago

ధన్యవాదాలు ఈ సమాచారం కోసం!

K
Krishna Reddy 1 day ago

మంచి వార్త. షేర్ చేస్తున్నాను.